భారతీయులకు కాఫీ, టీలు ఎలా అలవాటు చేశారో తెలుసా? | GyanBulb | Food History in Telugu | Episode 1

Gyan Bulb
Gyan Bulb
2.3 هزار بار بازدید - 4 سال پیش - ఈనాడు టీ వాడకంలో ప్రపంచంలోనే భారతదేశం
ఈనాడు టీ వాడకంలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంది. కాఫీ వాడకమూ మనలో కాస్త ఎక్కువే అవుతోంది. కొన్ని వందల యేళ్ళ క్రితం భారతీయులకు కాఫీ, టీలను ఎవరు, ఎలా అలవాటు చేశారు? మొట్టమొదటిసారి టీ తాగినప్పుడు మన ముత్తాతలు, ముత్తవ్వలకు ఏమనిపించింది? వీటికి మన సాహిత్యం నుంచి తోడి తెచ్చిన సమాధానాలే ఈ వీడియో.
ఈ వీడియో మొట్టమొదటిసారి పవన్ సంతోష్‌ Quora తెలుగులో భారతీయులకు కాఫీ, టీలు ఎలా అలవాటయ్యాయి?  అన్న ప్రశ్నకి సమాధానంగా రాశారు: https://qr.ae/TlTu6U
ఇందులోని వివరాలకు దాశరథి రంగాచార్యులు రాసిన జీవన యానం, కి.రాజగోపాలన్ రాసిన గోపల్లె జనాలు (తమిళ మూలంలో గోపల్లె పురత్తు మక్కళ్‌) పుస్తకాలు ఆధారం.
*****
వంటింటికీ ఉందొక చరిత్ర

వంటింట్లో ప్రతీ వంటకానికీ, ప్రతీ కూరగాయకీ, ప్రతీ దినుసుకీ, ప్రతీ వస్తువుకీ ఘనమైన చరిత్ర ఉంది. ఈ చరిత్ర మనకు చరిత్ర పాఠాలుగా చెప్పరు. చిన్నగా చూసే బంగాళాదుంప ప్రపంచ చరిత్రను మార్చిందన్నా, టీ కోసం చైనాలోకి బ్రిటన్ గూఢచారులను పంపించి దొంగిలించిందన్నా ఆశ్చర్యకరంగానూ, విజ్ఞానదాయకంగానూ ఉండవూ? అలాంటి విషయాలతో వంటింటికీ ఉందొక చరిత్ర సీరీస్‌ను మీ ముందుకు తెస్తున్నాం.
#వంటింటి_చరిత్ర #జ్ఞానబల్బు
4 سال پیش در تاریخ 1399/05/02 منتشر شده است.
2,307 بـار بازدید شده
... بیشتر