జీడిపప్పు-ఉల్లిపాయ పకోడీ | Cashew Onion Pakora | Evening Snacks | Snacks | Home Coking Telugu

HomeCookingTelugu
HomeCookingTelugu
4.2 هزار بار بازدید - 4 سال پیش - జీడిపప్పు ఉల్లిపాయ పకోడీ మంచి స్నాక్
జీడిపప్పు ఉల్లిపాయ పకోడీ మంచి స్నాక్ రెసిపీ. జీడిపప్పులు మాడిపోకుండా పకోడీలు కరకరలాడుతూ వచ్చేట్టు ఎలా చేయాలో మీరు ఈ వీడియోలో చూడచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి, సాయంత్రం టీతో లేదా కాఫీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.

#jeedipappuullipayapakodi #homecookingtelugu #cashewonionpakora #homecooking #hemasubramanian

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

Here's the link to this recipe in English: https://bit.ly/3nDfWZd

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: 4  

కావలసిన పదార్థాలు:

జీడిపప్పు - 100 గ్రాములు
శెనగపిండి - 1 కప్పు
బియ్యప్పిండి - 1 టేబుల్స్పూన్
ఉల్లిపాయ - 1 (పొడవుగా తరిగినది)
పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
కరివేపాకులు
కొత్తిమీర
అల్లం ముక్క - 1 (చిన్నగా తరిగినది)
కారం - 1 టీస్పూన్
పసుపు - 1 / 4 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
నీళ్లు
నూనె

తయారుచేసే విధానం:

జీడిపప్పులని పది నిమిషాలు నీళ్లలో నానపెట్టాలి

ఒక బౌల్లో శెనగపిండి, బియ్యప్పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు, కొత్తిమీర, అల్లం, కారం, పసుపు, ఉప్పు, నానపెట్టిన జీడిపప్పులని వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడీ పిండిని కాస్త గట్టిగా ఉండేట్టు తయారుచేయాలి

ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి, అందులో పకోడీలని చిన్న చిన్న ఉండలుగా చేసి వేసుకోవాలి

ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి

అంతే, జీడిపప్పు-ఉల్లిపాయ పకోడీలు తయారైనట్టే, వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - Facebook: HomeCookingTelugu
YOUTUBE: homecookingtelugu
INSTAGRAM - Instagram: homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com
4 سال پیش در تاریخ 1399/07/19 منتشر شده است.
4,238 بـار بازدید شده
... بیشتر