Enta Kalamokada - Annamayya Sankeerthana (ఎంత కాలమొకదా - అన్నమయ్య సంకీర్తన) Lyrics

Bijjam Brothers
Bijjam Brothers
68.2 هزار بار بازدید - 2 سال پیش - ఎంతకాలమొకదా  - అన్నమయ్య సంకీర్తన (Enta
ఎంతకాలమొకదా  - అన్నమయ్య సంకీర్తన (Enta Kalamokada - Annamayya Sankeerthana)

Singer – G Balakrishna Prasad garu; Composer - Rallapalli Ananta Krishna Sarma garu
(Courtesy - TTD & Sri Venkateswara Recording Project)

Lyrics -
ఎంతగాలమొకదా యీ దేహధారణము
చింతాపరంపరలఁ జిక్కువడవలసె

వడిగొన్న మోహంబువలలఁ దగులైకదా
కడలేని గర్భనరకము లీఁదవలసె
నడిమిసుఖములచేత ననుపుసేయఁగఁగదా
తొడరి హేయపుదిడ్డిఁ దూరాడవలసె

పాపపుంజములచేఁ బట్టువడఁగాఁగదా
ఆపదల తోడిదేహము మోవవలసె
చూపులకులోనైన సుఖము గానక కదా
దీపనభ్రాంతిచేఁ దిరిగాడవలసె

హితుఁడైన తిరువేంకటేశుఁ గొలువకకదా
ప్రతిలేని నరకకూపమునఁ బడవలసె
అతనికరుణారసంబబ్బ కుండఁగఁగదా
బ్రతిమాలి నలుగడలఁ బారాడవలసె
2 سال پیش در تاریخ 1401/10/21 منتشر شده است.
68,255 بـار بازدید شده
... بیشتر