KORUKUNNARORAYYA PART-2 NEW FOLK FULL SONG 2024 #MAMIDIMOUNIKA #MALLIKTEJA #MAMIDIMOUNIKAMUSIC

MAMIDI MOUNIKA MUSIC
MAMIDI MOUNIKA MUSIC
1.5 میلیون بار بازدید - 3 هفته پیش - KORUKUNNARORAYYA PART-2  NEW FOLK FULL
KORUKUNNARORAYYA PART-2  NEW FOLK FULL SONG 2024 #MAMIDIMOUNIKA  #MALLIKTEJA  #MAMIDIMOUNIKAMUSIC  



                    VIDEO CREDITS
                    -------------------------

SONGNAME: KORUKUNNARORAYYA PART2

LYRICS, SINGER,DIRECTION : MAMIDIMOUNIKA
MUSIC DIRECTOR : SV MALLIKTEJA
MUSICPROGRAMMING, FINALMIX & MASTERING: MAHENDER SRIRAMULA
FLUTE : PRAMODH
ADDITIONAL KEYS : EPHRAIM
DOP&EDITING : ARUNKOLGURI
DRONE : CHOTU
TITLEDESIGNER : RANA
FINAL EDITING & POSTER DESIGNER :
MAMIDI MANOJ
ASST : RAJU
ARTISTS : KASARLABHYMAIAH,HANMAVVA
CHILD ARTISTS : KASARLA ASHWITH,SANVIKA
ART DEPARTMENT : KASARLA BHEEMANNA,
B RAMESH
MAKEUP&HAIRSTYLE : NAVYA , ANUSHA
PRODUCER : MAMIDI ANJAIAH LAXMI
POST PRODUCTION : MV MUSIC &MOVIES STUDIOS


       KORUKUNNARORAYYA 2 LYRICS
      ------------------------------------------------------


పల్లవి:
ఇడిసిపెట్టనుర పిలగ సిగలోముడిసిపెట్టుకుంటార
ఒడిసిపట్టుకున్న గదరా అట్లెట్ల ఒదిలిపెట్టుకుంటార
ఓర్వజాలని మాటలన్న నేను ఓర్సుకుంటా తియ్ రా
ఓపిక తో నేనుంటరా నాకు ఓనమాలు నేర్పినోడ
పడుసుపిల్లను పలుకుతున్నర నాతో పదనిసలు పలికించ రారా
గడుసుదాన్నిర గంత కోపమా
గాలి మాటలు గంగొడ్డుకిసిరేసి రారా
ఏడువబోకురా అసలే  ఏగిర్తపడకురా ఏడ్సుకుంటైన నిన్నే ఏలుకుంటారా
తూడువబోకురా జర్ర తుర్తిగుండరా తండ్లాటెంతైన నువ్వే తనువునేలేది....
చరణం1:
నోటికచ్చిన మాటలన్న                  నీ నొసటన గీతనైత
సోటు ఇచ్చి మరిసిపోయిన          నీ సోపతి నేనిడువ
మాటిమాటికి కసురుకున్న           నీ మనుసుల నేనే ఉంట కాటికెళ్లెదాకనైన నీతో        కడదాక నడిసేవస్త
సోయి తెచ్చుకొని మెదులు నా సొగసుని  సూసి కదులు
మంచిగుంటరా మనువుజేసుకో మందితీరు మరువబోకుర నిదురవడుతలే నీ తలపులో
నీళ్లు నీళ్ళైతుంది నిండూ జిగుణం
చామనఛాయోడ  నా ఛామంతి నవ్వోడ నేను తిప్పిన మీసపోడ నా సిక్కటి గడ్డపోడ
నాకు నచ్చిన గోపాలుడా
నేను మెచ్చిన జోపాలుడా
నేను సెక్కిన అందగాడా
నాకు సిక్కిన పాటగాడా
మాది మామిడోరి వంశమురా
నేను మాటవడని పిల్లనుర  
మా బాపు మెచ్చిన బిడ్డనురా
అయిన బతిలాడుతున్నానురారా...
చరణం2:
ఎన్ని మాటలు వడితిరా
నీతొనెన్ని గోసలు వడితిరా
ఎంతకూ మారవేందిరా
ఎద్దు ఎవుసమన్న ఎరుగనోడ
నేను బెంగటీల్తనాని తెలుసు
నీ మీద బెంగవడుతనాని తెలుసు
నిన్ను సెరికి తెచ్చేది నేనే
గందుకె సింగులల్ల సెంగలియ్ర
ఆగమైందిరా అంగడైందిర
లోలోపల నలిగెర వయసు
గాయమైందిర గండమైందిరా
గందుకేయీ గేయమై పూసింది మనసు
తనుగులాడకురా గోంత పెనుగులాడకురా
ఉరుకులాడనురా ఇగ
ఊపిరివోద్దువు రా......  
మరిసీపోలేదురా నువ్వుంటే మురిపిపోతా   రా......
అర్సుకుంటా రా.... నీకే అంకితమైత రా...

ఎత్తుకోని పెంచినోడే నన్నిన్ని ఎత్తేసె మాటలంటుంటే
ఎవలతోని సెప్పుకోవాలె వీన్ని
ఎట్ల నమ్మి నానవొయ్యాలె.......

చరణం3:
పెయ్యి  మీద దెబ్బ వడితే
అది మాసిపోతుందేమొగాని
ఆడి మనసు మీద దెబ్బవడితే  
ఆడ మళ్ళ అతుకదు తెలుస
గుండెమీద పుండుజేసి ఆ పుండుమీద బండవెట్టి
గుట్టుగా ఎల్లిపోతే నేను
ఉట్టిగా   ఊకుంటన
బుద్ధిసెప్పురా బుదురకియ్యురా
ఏపకాయంత ఎర్రిని ఇడువురా
ఏలువట్టరా జోలపాడరా
ఎన్నెలా ఎలుగులమ్మ
ఎదిరీసూత్తుంది
కళ్ళోకి వస్తావో నా ఒళ్ళోకి వస్తావో
పిల్లదాని బడిలో పాఠాలు నేర్సుకుందువు రా.....
మల్లెపూల మడిలో మంచును మరుగావెడుదువు రా......    
సల్లగాలి సడిలో సింగులు సదిరీపోదువు రా.....

                  ✍️మామిడిమౌనిక
3 هفته پیش در تاریخ 1403/04/15 منتشر شده است.
1,538,416 بـار بازدید شده
... بیشتر