శ్రీమద్భగవద్గీత |అర్జున విషాద యోగము|1వ అధ్యాయము|Srimad Bhagavad Gita|Arjuna Viṣhāda Yogamu|Chapter 1

Sudharma
Sudharma
4.1 هزار بار بازدید - 6 ماه پیش - Learn Bhagavad Gita !!!Recitation with
Learn Bhagavad Gita !!!
Recitation with Anuswara and Visarga - according to Geeta Pariwar

శ్రీమద్భగవద్గీత - మహిమ
శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు శ్రీ పద్మ నాభుడైన విష్ణు భగవానుని ముఖారవిందము నుండి ప్రభవించింది.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు

భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు.
వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి 18 అధ్యాయాలను కలిపి వరకు"జ్ఞాన షట్కము" అని అంటారు.

కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం.

నిరాశ, సందేహములు  చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు  భగవద్గీత శ్లోకములను పఠించినచో  ఓదార్పు కలుగును.

అర్జున విషాద యోగము
-----------------------------------
శ్రీకృష్ణద్వైపాయన వ్యాసుల వారి మహాభారత గ్రంధంలో శ్రీకృష్ణ అర్జున సంవాదం 700 శ్లోకాల భగవద్గీత. ఈ 27 శ్లోకాలు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినట్టు వైశంపాయన మహాముని అర్జుని మనుమడు జనమేజయ మహారాజుకు వివరించారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుని కురుక్షేత్రంలో నా కుమారులు, పాండుకుమారులు ఏమి చేసారు అని అడగడానికి అక్కడకు యుద్ధానికి వెళ్ళారని తెలియకనా? కాదు. కురుక్షేత్రం అన్నది ధర్మ క్షేత్రం, ఎందరో దేవతల నిలయం, ఎన్నో యజ్ఞాలు జరిగిన స్థలం. ఆ ధర్మక్షేత్ర ప్రభావం ఏమైనా తన కుమారులపై పడిందా అన్న ఉత్సుకత ఆయనను అలా అడిగేలా చేసింది. అధర్మం వైపున్న తన కుమారుల మనసేమైనా మారిందా? లేక పాండుకుమారులు వంశక్షయానికి వెరసి ఏమైనా యుద్ధం ఆపారా, ఆపి వారు అడవులకు తపస్సుకు పోయారా అన్న కుతూహలం. ఇక్కడ ధృతరాష్ట్రుడు నా కుమారులు(మామకః), పాండుకుమారులు (పాండవ: ) అన్న భావం ప్రకటించడం ద్వారా పాండు కుమారులను తన కుమారులుగా అంగీకరించక వారిని వైరులగానే చూస్తున్నాడు అన్నది తెలియచేస్తుంది. క్షేత్రం అంటే దున్నే స్థలం. సేద్యం చేసే పొలంలో ఎలాగైతే కలుపు తీసివేయబడుతుందో అలాగా కౌరవులు దునుమాడబడతారు అన్నది ధర్మక్షేత్రానికి అర్ధం.

ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారథియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రథాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు, మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్థించాడు.
6 ماه پیش در تاریخ 1402/12/08 منتشر شده است.
4,153 بـار بازدید شده
... بیشتر