జగన్నాథ దేవాలయంpuri jagannath swamy temple Banjara hils hyderabad

balaji telugu Traveller
balaji telugu Traveller
1.1 هزار بار بازدید - ماه قبل - జగన్నాథ దేవాలయం భారతదేశం లోని తెలంగాణ
జగన్నాథ దేవాలయం భారతదేశం లోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఒడిషాకు చెమైన సముదాయంచే నూతనంగా కట్టించబడిన జగన్నాథ స్వామికి చెందిన దేవాలయం. ఈ దేవాలయం బంజారా హిల్స్ రోడ్ నెం. 12 లో నెలకొని ఉంది. ఇచట ప్రతీ సంవత్సరం రధయాత్ర సందర్భంగా అనేక వేలమంది భక్తులు హాజరవుతారు.[1] ఈ దేవాలయం 2009లో నిర్మింపబడింది. ఈ దేవాలయం పూరి లో నెలకొని ఉన్న జగన్నాథ దేవాలయం నకు ప్రతిరూపంగా భావిస్తారు. అదే విధమైన రూపకల్పన చేయబడిన దేవాలయంగా చెప్పబడుతుంది. ఈ దేవాలయంలో ప్రముఖ ఆకర్షణ భాగం "శిఖరం". ఇది 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న ఈ దేవాలయం సేండ్ స్టోన్ తో కట్టబడింది. ఈ నిర్మాణానికి అవసరమైన సుమారు 600 టన్నుల రాయిని ఒడిశా నుండి తేవడం జరిగింది. 60 మంది శిల్పులు ఈ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దేవాలయంలో విగ్రహాలు లక్ష్మీదేవి, శివుడు, గణేష, హనుమాన్, నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ రకమైన శిల్పాలు మానవుని అంతర్గత భావాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. దేవాలయంలో ప్రవేశం తర్వాత అంతర్గత భావాలను బయట ఉంచేందుకు సూచిస్తాయి.

గర్భగుడిలో జగన్నాథస్వామి తన సన్నిహితులైన భలభద్రుడు, సుభద్రాదేవి లతో కలసి ఉన్నాడు.
ماه قبل در تاریخ 1403/05/15 منتشر شده است.
1,103 بـار بازدید شده
... بیشتر