Murmura Making Business | బొరుగుల తయారీ వ్యాపారం మాది | బతుకు బడి

Business Book
Business Book
660.5 هزار بار بازدید - 2 سال پیش - బొరుగులు (ముర్మురా) ఏ విధంగా తయారు
బొరుగులు (ముర్మురా) ఏ విధంగా తయారు చేస్తారు.. మిల్లు ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది.. క్వింటా ధాన్యం నుంచి ఎన్ని బొరుగులు వస్తాయి.. ఈ వ్యాపారం మొదలు పెడితే ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి.. వంటి సమగ్ర సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. గత నలభై ఏండ్లుగా.. నల్గొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలో బొరుగుల తయారీ మిల్లు నడుపుతున్న కడవేరు మల్లిఖార్జున్ గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. పూర్తి వీడియో చూస్తే సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని [email protected] మెయిల్ ఐడీకి పంపించండి. కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. Title : Murmura Making Business | బొరుగుల తయారీ వ్యాపారం మాది | బతుకు బడి Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business #BathukuBadi #బతుకుబడి #murmuramaking
2 سال پیش در تاریخ 1401/10/07 منتشر شده است.
660,507 بـار بازدید شده
... بیشتر