Guntur Famous Raju Gari Royyla Pakodi | Fish Pakodi | Chiken Pakora |రొయ్యల పకోడీ|Guntur | Food Book

Food Book
Food Book
203.6 هزار بار بازدید - 3 سال پیش - స్వతహాగా ఆహార ప్రియులైన రాజు గారి
స్వతహాగా ఆహార ప్రియులైన రాజు గారి రొయ్యల పకోడీ శాల నిర్వాహకులు సాయి రామ్ గారికీ  నూతన రుచులు ఆస్వాదించడమంటే మక్కువ.లభించు ప్రదేశం  సుదూరమైన తీరిక సమయంలో తమ మిత్రులతో కలసి వెళ్లడం ఓ వ్యాపకం.ఆ నేపధ్యమే వారితో రాజు గారి రొయ్యల పకోడీ శాల ఆరంభించేలా చేసింది.

తమకు ఇష్టమైన ఆహార రంగాన రాణించాలన్న వారి అభికాంక్ష , వైవిధ్యంగా రొయ్యలు,చేపల పకోడీలు అందించాలన్న తలంపు. తయారీలో అత్యంత సూక్ష్మ పరిశీలన ,మేలిమి గల ముడి పదార్థాల వినియోగం,సాయి రామ్ గారిది లాభాపేక్ష ధోరణి కాకపోవడం వెరసి. నాణ్యతతో కూడిన ఆహారం తక్కువ ధరకే అందించసాగి స్వల్పకాలంలోనే గుంటూరు వాసుల విశేష ఆదరణతో మంచి గుర్తింపు పొందారు.


"రాజు గారి రొయ్యల పకోడీ"

చూడగానే ఈ అల్పాహారం యొక్క సద్గుణం  తెలియవస్తుంది..నూనెలో మునిగితేలిన పకోడీలు  మిళుకుమిళుకుమంటూ స్వర్ణపు జిలుగులు విరజిమ్ముతూ  నోరూరించే  గబుక్కున తినాలన్న కాంక్ష కలిగిస్తుంది.అల్పాహారానికి అంతలా సమున్నతి కల్పించారు సాయి రామ్ గారు.

నూనె ఏ మాత్రం ఇంకి ఉండదు పకోడీ లో .చూస్తే అసలు నూనెలో వేయించారా అన్న సందేహం కలుగుతుంది.కరకరలాడుతూ కమ్మటి మసాలా పరిమళం వేదజల్లుతూ పసందైన రుచి జిహ్వానికి అందిస్తుంది .తింటున్న కొద్ది..తినాలనిపిస్తుంది. ఓ సారి రుచి చూస్తే ఎప్పటికీ ఆ రుచిని మరవరు.

నా ఆహార-విహారనా ఆస్వాదిస్తున్న వారి అభిప్రాయ సేకరణలో పూర్తి సంతృప్తికర వ్యక్తీకరణ పొందిన ఆహార పదార్థం గుంటూరు రాజు గారి రొయ్యల పకోడీ .రుచి,శుచి నాణ్యతే అందుకు ప్రామాణికం. కనుకనే గుంటూరు రాజు గారి రొయ్యల పకోడీ కోసం నిత్యం సుదూర ప్రాంతాల నుంచి సైతం వస్తున్నారు.



చిరునామా:- రామరాజు టవర్స్ 9/2, అరండల్ పేట,గుంటూరు.

గూగుల్ లొకేషన్ :-
https://maps.app.goo.gl/h7e2nFgAd4UTW...
3 سال پیش در تاریخ 1400/07/10 منتشر شده است.
203,667 بـار بازدید شده
... بیشتر