Gold Stolen 30 Tulas | Thieves Keep 27 Tulas Gold Again Victim's Home | Bolli Kunta In Warangal

ETV Telangana
ETV Telangana
7.7 هزار بار بازدید - پارسال - పక్కా పథకంతో బంగారం చోరీ చేసిన
పక్కా పథకంతో బంగారం చోరీ చేసిన దొంగలు.. వారం తర్వాత ఎందుకో మనసు మార్చుకున్నారు. పోలీసులు వెతుకుతున్నారన్న భయమో.. లేక మరేదో కానీ దొంగలించిన మొత్తంలోంచి కొంత పుత్తడిని బాధితుల ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయారు.  ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో అన్నదమ్ములతో కలిసి ఉమ్మడి కుటుంబంతో నివసిస్తున్న గోపి ఇంట్లో వారం క్రితం చోరీ జరిగింది. 30 తులాల బంగారాన్ని దుండుగులు దోచుకెళ్లారు.  బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో...  డాగ్ స్క్వాడ్ సహాయంతో చోరి జరిగిన పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా  మారింది. ఈలోపు అనూహ్యంగా పోయిన బంగారం దొరికింది.  దొంగలు బాధితుల ఇంటి ప్రహరీ గోడ వద్ద బంగారం విడిచిపెట్టి వెళ్లిపోయారు. పోయిన బంగారం దొరికిందని బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ 30 తులాల బంగారం చోరీకి గురైతే... వచ్చింది మాత్రం 27 తులాలే ఉన్నాయని బాధితులు వాపోయారు. పోలీసులు దర్యాప్తు చేసి మిగిలిన 3 తులాల్ని కూడా కనిపెట్టాలని వేడుకుంటున్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana  
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : Facebook: ETVTelangana
☛ Follow us : Twitter: etvtelangana
☛ Follow us : Instagram: etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
پارسال در تاریخ 1402/01/10 منتشر شده است.
7,768 بـار بازدید شده
... بیشتر