YEMI BAADHAYYA SAAMI ||2023 VOL2 | | SRIDHARMASASTA OFFICIAL||

SRI DHARMASASTA MUSIC
SRI DHARMASASTA MUSIC
260.9 هزار بار بازدید - 8 ماه پیش - GANGAPUTRA NARSINGH RAO| RAMESH PATANCHERU
GANGAPUTRA NARSINGH RAO| RAMESH PATANCHERU | SRIKANTH NADIMINTI | GAJWEL VENU||


SRI DHARMASASTA
OFFICIAL

Lyrics by : Likhith Nadiminti

Producer : Patancheru
Ramesh garu

Sannidhanam guruswamy:Nadiminti Srikanth garu

coordinators : M.Sai Kiran garu & Ch.Raju garu

music :Gajwel venu
singer:Gangaputra guruswamy Narsing rao
keyboard:Naveen sambari
Editing :Karthik sunny

LYRICS

ఏమి బాధయ్యా సామీ      
      ఇంకొక్క అడుగైనా వేయలేనేమి  
ఇది ఏమి బాధయ్యా సామీ
      నా కాళ్ళ కీళ్ళైన విరిగిపోవేమి ||  

దూరమే తరగనూ అంటున్నది
        నిన్ను కాలమే కానరాకుండా
నా ధ్యానమే అడుగేయమంటున్నది
        నీ నామమే నే జెప్పుకుంటా |

అను పల్లవి :-

ఘడియ ఘడియ గండమయ్యా
  మా ఇంట పిల్లా జెల్ల సల్లగుండా
నా ప్రాణమాగిపోకుండా సూడయ్య
  నేనుండా నిను జూడకుండా
                                         
  ఏమి బాధయ్యా సామీ      
      ఇంకొక్క అడుగైనా వేయలేనేమి  
ఇది ఏమి బాధయ్యా సామీ
      నా కాళ్ళ కీళ్ళైన విరిగిపోవేమి ||


Charanam 1 :-
అడుగు నేల మీద నేను బెట్టి
ఓపికైన లేదుగాని దారి బట్టి
అలసి సొమ్మసిల్లిన నన్ను జూసీ
మాల వేయని స్వాములు చెంతకొచ్చి

అయ్యప్పా నా దేవుడె నీవంటు సేతులెత్తి
నన్ను మొక్కినారె
అయ్యప్పా అరటి పండునె నాకిట్ట
ఒలిసివెట్టి నోటబెట్టినారె  ||                                      

అయ్యా....  
నా ఎముకలన్ని అరిగె
ఒంగి లేచి నడవగా...
అయ్యప్పా....  
నా అరికాళ్ళు పర్రొచ్చె
ఇసుక రాళ్లు దూరగా...

కాళ్లు నెలమీద బెట్టగా
నొప్పి నెత్తికెక్కినాదిరా

ఏమి బాధయ్యా సామీ      
      ఇంకొక్క అడుగైనా వేయలేనేమి  
ఇది ఏమి బాధయ్యా సామీ
      నా కాళ్ళ కీళ్ళైన విరిగిపోవేమి ||
                         

Charanam 2:-

ఆగమాయె బతుకు బిడ్డ వుట్టి
సావుకారి కాడ పైసలప్పుదెచ్చి
దాన్ని పద్దెంది లేకున్నా పెండ్లి జేసి
కట్టలేక పొలము తాకట్టు బెట్టి

అయ్యప్పా నీకడకొచ్చి కోట్ల శరణు వేడ
నాకు బలముననీరా
అయ్యప్పా నా రాత మార్చె కొండ
కానొచ్చెదాకడుగు వేయించరా ....||

అయ్యా.......
మా అమ్మకొచ్చె గోసను
కాల్చు కట్టె మిగలకా...
అయ్యప్పా.......
మా నాన్న ఘడియను మార్చు
ఇకనైనా కరుణించగా..

వాళ్ళ బాధ నేను జూడరా
అమ్మయ్య నువ్వులే కరువాయెరా

ఏమి బాధయ్యా సామీ      
      ఇంకొక్క అడుగైనా వేయలేనేమి  
ఇది ఏమి బాధయ్యా సామీ
      నా కాళ్ళ కీళ్ళైన విరిగిపోవేమి ||
                 
Charanam 3:-

అరికాళ్ల తోలరిగి బుగ్గలొచ్చె
ఆ బుగ్గ పగిలి బొక్క బైటికొచ్చె
సావు కన్న నొప్పి నన్ను ఏడిపించే
కాని కొండలన్ని నువ్వు దాటిపించే

అయ్యప్పా ఎన్ని హృదయాలు గదిలొచ్చె
ఉండలేక నీ కొండదాకా
అయ్యప్పా ఎన్ని జన్మాలపుణ్యాన్ని
మూటగట్టి నీ పాదయాత్ర ||

అయ్యా......
నా ప్రాణమె వోతుందింకెన్ని మైళ్లవేటరా
అయ్యప్పా ....
అంత దూరాన దాగుండి
నడిపించె ఆటేందిరా

కొండాలెట్లైనా నే దాటగా
నినుగాన అదృష్టమె పొందనా                    

ఏమి బాధయ్యా సామీ      
      ఇంకొక్క అడుగైనా వేయలేనేమి  
ఇది ఏమి బాధయ్యా సామీ
      నా కాళ్ళ కీళ్ళైన విరిగిపోవేమి ||
8 ماه پیش در تاریخ 1402/08/14 منتشر شده است.
260,968 بـار بازدید شده
... بیشتر